టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. చాలా తక్కువ కాలంలోనే తనకుంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటనకు భారతీయులే కాదు.. విదేశీయులు కూడా ఎంతగానో ఫిదా అయ్యారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ ని ప్రేమించే అభిమానుల సంఖ్య చాలా ఎక్కువ అయ్యింది.ఇక ఈ రోజు (మార్చి 27) రామ్ చరణ్ పుట్టినరోజు. ఇప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో తమ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు ఫ్యాన్స్. రామ్ చరణ్ కు సంబంధించిన అరుదైన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మెగా. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఇంకా తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ అరుదైన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ తెగ చక్కర్లు కొడుతుంది.


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిన్నప్పుడు అంటే ఆరు నెలల వయసున్నప్పుడు పవన్ కళ్యాణ్ అక్షింతలు వేస్తూ ఆశీర్వదిస్తున్న ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసి తెగ వైరల్ చేస్తున్నారు.ఇందులో పవన్ కళ్యాణ్ యంగ్ లుక్స్ అయితే చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే చెప్పలేనంత ప్రేమ అన్న సంగతి తెలిసిందే. ఇక తన అన్నయ్య కొడుకు రామ్ చరణ్ అంటే చాలా ఎక్కువ ఇష్టమని పలుమార్లు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.ప్రస్తుతం రామ్ చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ సినిమా టైటిల్ లోగో వీడియోని షేర్ చేస్తూ.. రామ్ చరణ్ కి బర్త్ డే విషెస్ తెలిపారు మేకర్స్. ఇందులో రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ ఇంకా తెలుగమ్మాయి అంజలి నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: