ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా సెకండ్ భాగాన్ని కూడా ఇప్పుడు త్వరలోనే విడుదల చేయబోతున్నారు ఏప్రిల్ 28వ తేదీన సినిమా విడుదలకు సిద్ధం కాగా మార్చ్ 29న ఈ సినిమా ఆడియో లాంచ్ ఏర్పాటు చేసి అందులో ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మొదటి భాగం ట్రైలర్ లాంచ్ కు రజనీకాంత్ తో పాటు కమలహాసన్ కూడా వచ్చి ట్రైలర్ లాంచ్ చేశారు. కానీ విశ్వసనీయ వర్గాల నుండీ అందుతున్న సమాచారం ప్రకారం PS -2 సినిమా ట్రైలర్ లాంచ్ కి కమలహాసన్ మాత్రమే రాబోతున్నారు. అయితే ఈసారి రజనీకాంత్ రావడం లేదని తెలిసి ఆయన అభిమానులు కొంత వరకు నిరాశ వ్యక్తం చేసినట్లు సమాచారం.
అయితే ఇందుకు కారణం రజినీకాంత్ ప్రస్తుతం తన జైలర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆడియో లాంచ్ కి హాజరు కాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మణిరత్నం డ్రీం ప్రాజెక్టు రెండవ భాగం త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. మొదటి భాగంతో రూ.450 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా ఇక రెండవ భాగంతో ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.