బాలకృష్ణ హీరోగా నిర్మాత బెల్లంకొండ సురేష్ తెరకెక్కించాల్సిన చిత్ర హరిహర మహాదేవ్.. ఈ చిత్రం కూడా కొన్ని కారణాల చేత పక్కకు పెట్టేయడం జరిగింది. ఆ తర్వాత చిత్రం విక్రమ్ సింహ భూపతి.. ఈ చిత్రం కూడా 60 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది అప్పుడు బాలకృష్ణ ,కోడి రామకృష్ణ మధ్య కొన్ని విభేదాలు రావడంతో ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయినట్లు సమాచారం. మరొక చిత్రం నర్తనశాల.. ఈ చిత్రంలో సౌందర్య నటించడం జరిగింది.అయితే సౌందర్య మరణించడంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం ఆగిపోయింది. అలాగే బాలకృష్ణ ,డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్లో రైతు అనే చిత్రం టైటిల్ ని ప్రకటించారు కానీ వీరిద్దరి మధ్య కొన్ని విభేదాలు రావడంతో ఈ సినిమా పక్కన పెట్టినట్లు సమాచారం.
ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు ఒకవైపు యాడ్లలో నటిస్తూ మరొకవైపు రాజకీయాల్లో ఇలా అన్నిటిలో కూడా చురుకుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య 108వ సినిమాలు బిజీగా ఉన్నారు.ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా బాలయ్య కూతురి పాత్రలో శ్రీ లీల నటిస్తున్నది. బాలయ్య ఒకవేళ ఈ చిత్రాలు విడుదల అయ్యుంటే బాలయ్య కెరియర్ మరొక లాగా ఉండేదని చెప్పవచ్చు