ఒక సినిమా పెద్ద హిట్టు కావాలంటే పెద్ద పెద్ద స్టార్లు నటించాల్సిన పని లేదు. జస్ట్ ఆ సినిమా కంటెంట్ బాగుంటే చాలు. ఎంత చిన్న సినిమా అయినా పెద్ద హిట్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ చేస్తుంది. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది బలగం చిత్రం. తెలుగు తెరపై కమెడియన్‏గా అలరించిన వేణు యెల్దండి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన బలగం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి ఇంకా మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా మార్చి 3న విడుదలైన  పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. అంతేకాకుండా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకొని ఎమోషనల్ గా టచ్ చేసిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. అటు బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు రాబట్టిన ఈ సినిమా .. అతి తక్కువ సమయంలోనే ఓటీటీలోకి కూడా వచ్చింది.


థియేటర్లలో రిలీజ్ అయి నెల తిరక్కుండానే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది బలగం సినిమా . ఓవైపు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ కూడా థియేటర్లలో కూడా చాలా భారీగానే వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. బలగం బ్రేక్ ఈవెన్ టార్గెట్ మొత్తం రూ. 1.2 కోట్లు కాగా.. మొదటి వీకెండ్ కే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక 24 రోజులు పూర్తయ్యే సరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 11 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటి దాకా ఈ సినిమా రూ.10 కోట్ల పైగా లాభం రాబట్టినట్లు సమాచారం తెలుస్తోంది.అలాగే మరోవైపు ఓటీటీలోనూ దూసుకుపోతుంది బలగం చిత్రం. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. డిజిటల్ ప్లాట్ ఫాంలో ఏకంగా టాప్ 2 ట్రెండింగ్ లో ఉంది.ఇంకా అంతేకాకుండా.. రికార్డ్ స్థాయిలో కూడా వ్యూస్ అందుకుంటుంది ఈ చిత్రం. ఈ మూవీతో దర్శకుడిగా భారీ విజయాన్ని అందుకున్న వేణు యెల్దండి ఖచ్చితంగా ఇంకో హిట్ సినిమా తీస్తే స్టార్ డైరెక్టర్ అవ్వడం పక్కా. ఈ సినిమాకి తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: