ఫ్యాంటసీ సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కొత్త కాదు. ముఖ్యంగా దేవుడు ఫ్యాంటసీ నేపధ్యంలో తీసిన సినిమాలు గతంలో కొన్ని సూపర్ హిట్ అయితే మరికొన్ని సూపర్ ఫ్లాప్ అయ్యాయి. ఒక వ్యక్తి జీవితంలో ఓడిపోయినప్పుడు అతడికి దేవుడు కాలం రూపంలో వచ్చి ఆ ఓడిన వ్యక్తికి రెండవసారి అవకాశం ఇస్తే ఆమనిషి జీవితం ఏమవుతుంది అన్న విషయం చుట్టూ అల్లబడిన కథ ‘వినోదయ సితమ్’ తమిళంలో హిట్ అయింది.


ఇప్పుడు అదే మూవీని సముద్ర ఖని తెలుగులో పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ లను పెట్టి రీమేక్ చేస్తున్నాడు. ఈమూవీకి త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందించడంతో అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఈమూవీలో పవన్ నటించినందుకు అతడికి రోజుకు రెండు కోట్లు పారితోషికం ఇవ్వడం మరింత సంచలనంగా మారింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఒక సినిమాను మొదలు పెడితే ఆసినిమా ఎప్పుడు పూర్తి అవుతుందో ఆమూవీ తీసే దర్శకుడుకి కూడ తెలియదు.


అయితే పవన్ కళ్యాణ్ తన పద్ధతికి విరుద్ధంగా ఈమూవీని చాల వేగంగా పూర్తి చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈసినిమాకు సంబంధించి పవన్ నటించవలసిన టాకీ పార్ట్ పూర్తి కావడంతో సముద్ర ఖని భావయుక్తంగా ‘దేవుడికి ధన్యవాదాలు’ అంటూ సోషల్ మీడియాలో తన కామెంట్ పెట్టాడు. అంతేకాదు ఈమూవీ రిలీజ్ డేట్ ను జూలై 28 అని ప్రకటించడం మరింత సంచలనంగా మారింది. ఈమూవీలో పవన్ కళ్యాణ్ లుక్ చాల లేటెస్ట్ ఫ్యాషన్ లుక్ లో కనిపించబోతోంది.


పవన్ లుక్ కు సంబంధించి ముంబాయ్ కి చెందిన ఒక డ్రెస్ డిజైనర్ అలాగే హెయిర్ స్టైలిస్ట్ చాల జాగ్రత్తలు తీసుకోవడంతో ఈమూవీలో పవన్ ట్రెండీగా కనిపిస్తాడని తెలుస్తోంది. యూత్ ను ఆకర్షించడానికి ఈమూవీలో పవన్ సాయి ధరమ్ తేజ్ లు ఒక బాలీవుడ్ బ్యూటీతో చేయబోయే ఐటమ్ సాంగ్ ఈమూవీకి ట్రెండ్ సెటర్ గా మారుతుందని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: