టాలీవుడ్ యంగ్ హీరో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దసరా. అంటే సుందరానికి సినిమా  ప్లాప్ గా షాక్ ఇచ్చిన తర్వాత  ఈ సినిమా పై నాని భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లే చాలా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు.ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన సుకుమార్‌ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల తొలిసారి దర్శకుడిగా మారిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో  భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నాని తన కెరీర్‌లోనే పూర్తి స్థాయిలో మాస్‌ లుక్‌లో కనిపించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఎంతగానో ఆకర్షించారు. ఈ మూవీకి సంబంధించి విడుదలైన టీజర్‌ ఇంకా ట్రైలర్‌ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు బాగా పెంచేశాయి. ఇక ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఆట నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది.నాని, కీర్తి సురేష్‌ల అద్భుత నటన ఇంకా శ్రీకాంత్‌ దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అవుతున్నారు. పైగా ఈ మూవీలో మాస్‌ ఎలిమెంట్స్‌, టేకింగ్ అద్భుతంగా ఉందంటూ చూసినవాళ్లు అందరూ కూడా చెబుతున్నారు. 


ఇక ఇదిలా ఉంటే తెలుగుతోపాటు, హిందీ , మలయాళ, కన్నడ భాషల్లో చాలా గ్రాండ్‌గా రిలీజైన ఈ మూవీ థియేట్రికల్‌ బిజినెస్‌ ఓ రేంజ్‌లో జరిగినట్లు సమాచారం తెలుస్తోంది. దసరా చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 47.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగడం విశేషం.నాని కెరీర్‌లో ఈ రేంజిలో థియేట్రికల్ బిజినెస్‌ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఖచ్చితంగా రూ.47.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌ రావడం ఇప్పట్లో మరే పెద్ద విడుదలకు లేకపోవడంతో కలెక్షన్లు రావడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే నాని కెరీర్‌లో ఇప్పటి దాకా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ఎంసీఏ ఉంది. ఈ సినిమా అప్పట్లో రూ. 40 కోట్లు రాబట్టింది. దీంతో దసరా సినిమా చాలా ఈజీగా ఈ సినిమా రికార్డు బ్రేక్‌ చేసి మరో కొత్త రికార్డ్‌ నెలకొల్పడం ఖాయమని అతని అభిమానులు ఫిక్స్‌ అవుతున్నారు. మరి దసరా ఎలాంటి వండర్స్‌ సెట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: