భయంకరమైన ప్రమాదం బారిన పడి మృత్యువు వరకు వెళ్ళివచ్చి తిరిగి యాక్టివ్ లైఫ్ లోకి వచ్చిన వారి సంఖ్య చాల తక్కువగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి అదృష్టం పొందిన వారి లిస్టులో సాయి ధరమ్ తేజ్ చేరిపోయాడు. మోటార్ బైక్ ప్రమాదం నుండి చాల త్వరగా కోలుకుని ఇప్పుడు వరసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.



లేటెస్ట్ గా అతడు నటించిన ‘విరూపాక్ష’ మూవీ వచ్చే నెలలో సమ్మర్ రేస్ ను టార్గెట్ చేస్తూ ఈ సమ్మర్ లో విడుదలకాబోతోంది. ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు జరిగిన ప్రమాదసమయంలో వచ్చిన అనుభవాలు గురించి వివరించాడు. తనకు జరిగిన ప్రమాదాన్ని తాను ఒక పీడకల లా భావించడం లేదనీ అది తనకు ఒక లెసన్ లా భావిస్తున్నానని కామెంట్ చేసాడు.



తను చిన్నప్పటి నుండి ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉందని ఈ అలవాటు వల్ల తాను ఎక్కడికైనా వెళితే చాలు చాలామంది తన చుట్టూ చేరేవారని తన చిన్నప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అయితే తనకు ప్రమాదం జరిగాక కొన్ని వారాల పాటు తాను ఆషాక్ తో తాను మాట్లాదలేకపోయిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆసమయంలో తనకు తన తల్లితో పాటు తన మామయ్యలు చిరంజీవి పవన్ లు ఇచ్చిన సపోర్ట్ తన జీవితంలో మర్చిపోలేను అని చెపుతున్నాడు.


తిరిగి తాను షూటింగ్ లు మొదలుపెట్టి నటిస్తున్నప్పుడు ఏదైనా ఒక సీన్ లో బైక్ నడపవలసిన సీన్ వచ్చినప్పుడు తాను బైక్ నడపడానికి భయపడుతున్నప్పుడు తన తల్లితో పాటు తన చిన్న మామయ్యా పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్ కు వచ్చి దగ్గర ఉండి బైక్ ఎక్కించిన విషయం తనకు ఎప్పుడు గుర్తుండిపోతుంది అని అంటున్నాడు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘విరూపాక్ష’ మూవీ చేతబడుల చుట్టూ తిరిగే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ ఆమూవీ విజయం తన కెరియర్ కు ఎంతో అవసరం అని అంటున్నాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: