ఎందరో టాప్ హీరోలతో నటించి మధ్యలో నాగచైతన్యను ప్రేమించి పెళ్ళి చేసుకుని ఆతరువాత విడిపోయిన సమంత కు ఒక హీరో పై తాను మనసు పడుతున్నాను అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ‘శాకుంతలం’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు  ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత కొన్ని ఆసక్తికర విషయాలను తెలియచేసింది.


ఎన్నో సినిమాలలో ఎన్నో పాత్రలను చేసిన తనకు డ్రీమ్ రోల్ అంటూ ఏమిలేదని ఎటువంటి పాత్రను అయినా తాను ఇష్టపడి నటిస్తాను అని చెపుతూ తన మనసులో మాత్రం ఒక హీరో ఉన్న విషయాన్ని బయటపెట్టింది అతడే ఫహాద్ ఫాజిల్. మళయాళంలో స్ట్రయిట్ సినిమా చేస్తే ఫహాద్ ఫాజిల్ తో నటించాలనే కోరిక తనకు ఉందని చెపుతూ గతంలో తాను అతడితో ఒక సినిమాలో నటించినప్పటికీ ఆమూవీలో తన పాత్ర చిన్నది కావడంతో తన కోరిక తీరలేదు అని అంటోంది.


ఫహాద్ ఫాజిల్ మంచి నటుడు మాత్రమే కాకుండా మంచి దర్శకుడు కూడ మళయాళ ఫిలిం ఇండస్ట్రీలో ఇతడికి ఎంతో పేరుంది. తాను నటించే సినిమాలో తన పాత్ర తనకు నచ్చకపోతే నిర్మాతలు ఎంతటి పారితోషికం ఇచ్చినా ఫాజిల్ నటించడు అని అంటారు. మళయాళ ఫిలిం ఇండస్ట్రీని చూసి తాను ఎంతో నేర్చుకున్నాను అని ఇదే ఇంటర్వ్యూలో చెప్పింది.


నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత టాలీవుడ్ టాప్ హీరోలు తమ సినిమాలలో సమంతను హీరోయిన్ గా ఎంపిక చేసే విషయంలో తమదైన మౌన ముద్ర కొనసాగిస్తున్నారు అన్న గాసిప్పులు కూడ ఇండస్ట్రీలో ఉన్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా ఈనెలలో విడుదల కాబోతున్న ‘శాకుంతలం’ మూవీ విజయం కోసం ప్రమోషన్ లో ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలు సమంత అన్వేషిస్తోంది. చైతూతో విడిపోయిన తరువాత ఆమె నటించిన భారీ సినిమా కావడంతో సమంత కోసం ‘శాకుంతలం మూవీని చూడటానికి ఎంతమంది వస్తారు అన్న చర్చలు కూడ ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: