నాచురల్ స్టార్ నాని తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా తన అద్భుతమైన నటన తో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన నాని తాజాగా శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించినటువంటి దసరా అనే పక్క ఊర మాస్ కమర్షియల్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో కీర్తి సురేష్ నాని కి జోడి గా నటించగా ... సంతోష్ నారాయణన్ ఈ క్రేజీ మూవీ కి సంగీతం అందించాడు.

మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ భారీ ఎత్తున మార్చి 30 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి అద్భుతమైన పాజిటివ్ టాక్ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే దక్కడంతో ఇప్పటికే ఈ మూవీ కి జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లు ఇప్పటికే దక్కాయి. దానితో ప్రస్తుతం ఈ మూవీ లాభాలను అందుకుంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా నాని "దసరా" మూవీ సక్సెస్ పై స్పందించాడు.  తాము ఊహించిన దాని కంటే దసరా మూవీ చాలా పెద్ద సక్సెస్ అయ్యింది అని నాని వెల్లడించాడు. ఈ మూవీ ని చూసిన వారంతా చాలా గొప్పగా స్పందిస్తున్నారు. మూవీ విడుదల అయిన రోజు నుండి నా ఫోన్ మోగుతూనే ఉంది. ఈ మూవీ చేస్తూ మన కల్చర్ ... బతుకమ్మ సహా చాలా విషయాలను నేర్చుకున్నాను. చిరంజీవి ..  తారక్ ... చరణ్ ... ప్రభాస్ ... మహేష్ ఇలా అందరూ మెసేజ్ చేయడం ఆనందంతో పాటు బాధ్యతను కూడా పెంచుతుంది అని నాని అన్నాడు. అలాగే రాబోయే రోజుల్లో మంచి పాత్రలు చేస్తా అని నాని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: