తాజాగా రష్మీక పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించి ఒక పోస్టర్ను విడుదల చేశారు చిత్ర బృందం. రష్మిక చేతులు కట్టుకొని ఉన్న ఒక ఫోటోని మనం ఇక్కడ చూడవచ్చు. ఇందులో రష్మిక ఒక ఎన్నారై అమ్మాయిగా కనిపించబోతున్నట్లు ఈ ఫోటోను చూస్తే అర్థమవుతోంది. యూరప్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి రష్మిక పోస్టర్ చూస్తుంటే అందరికీ ఆసక్తి కలిగించే కనిపిస్తోంది రష్మిక మరొకసారి మైమరిపిస్తోందని చెప్పవచ్చు.
రష్మిక వరుసగా పలు చిత్రాలతో కమిట్ అవుతూ ఉండడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం పుష్ప -2 సినిమాలో రష్మిక నటిస్తున్నది ఇవే కాకుండా మరో రెండు తెలుగు సినిమాలలో కూడా రష్మిక నటిస్తోంది ఇతర భాషలలో కూడా ఆఫర్లు వస్తున్న ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉంది . ఇటీవల బాలీవుడ్లో నటించిన ఈమె చిత్రాలన్నీ కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయతున్నాయి.. అయినప్పటికీ కూడా ఈమెకు అవకాశాలు మాత్రం వెలుబడుతూనే ఉన్నాయి. మరి బాలీవుడ్ లోనే త్వరలోనే మరొక సినిమాకు కమిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక రష్మిక మొత్తానికి సౌత్ మరియు నార్త్ లో కూడా బిజీ హీరోయిన్గా పేరుపొందింది. నేటి రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.