తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోలలో నితిన్ ఒకరు. నితిన్ ఇప్పటికే ఎన్నో క్లాస్ మరియు మాస్ మూవీ లలో హీరో గా నటించి ఇటు క్లాస్ ... అటు మాస్ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా నితిన్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో రూపొందిన మాచర్ల నియోజకవర్గం అనే పక్కా మస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో కృతి శెట్టి ... క్యాథరిన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నితిన్ ... వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా నితిన్ ... వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందబోయే మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతుంది. ఇది వరకే ఈ ముగ్గురి కాంబినేషన్ లో భీష్మ మూవీ రూపొంది మంచి విజయం సాధించింది. దానితో వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న రెండవ మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో ఒక అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉండబోతున్నట్లు ... ఆ స్పెషల్ సాంగ్ లో శ్రీ లీల ను తీసుకునే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: