జయసుధ లాంటి ఒక హీరోయిన్ ని వర్మ ఇంప్రెస్స్ చేయాలనీ అని తెగ ట్రై చేస్తున్న టైం అది. పైగా అప్పటికే ఆమెకు పెళ్లయ్యింది అని తెలిసి కూడా ఒక హీరోయిన్ తో తనకు పరిచయం ఉందని చెప్పుకోవాలని తెగ ఉబలాట పడుతున్నాడు వర్మ. సరిగ్గా అదే టైం లో తరుణీ రావు సీన్ పేపర్ తీసుకెళ్లి జయసుధ గారి ఇంట్లో ఇచ్చేసి రమ్మని వర్మకు చెప్పాడు. ఆ సీన్ కూడా వర్మని రాయాలని కూడా చెప్పాడు.
దాంతో రాత్రంతా కూర్చొని అందంగా రాయాలని ప్రయత్నించి ప్రయత్నించి, పదికి పైగా సార్లు తన చేతి రాత బాగోలేదని మార్చేసి మళ్లి తెల్లవారు జామున కూడా కాసేపు చక్కగా రాయడానికి ట్రై చేసి చివరికి జయసుధ షూటింగ్ కి వచ్చే టైం కి సీన్ పేపర్ తీసుకొని ఆమె చేతిలో పెట్టాడు. అది చూసి జయసుధ ఈ సీన్ ఇంత బాగా రాసింది ఎవరు అని అడుగుతుంది అని భావించి తనలో తానే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా వేసుకుంటున్నాడు. కానీ జస్ట్ ఆ పేపర్ చూసి ఎన్ని పేజీలు అని సింపుల్ గా అడిగేసరికి వర్మ ఉత్సహం నీరుగారి పోయింది. కనీసం సీన్ ఏంటో చెప్పడానికి కూడా వర్మ కు అవకాశం దొరక్కపోవడం తో కాస్త ఫీల్ అయ్యాడు. అప్పటికే వందల సినిమాలో నటించి వేల కొద్దీ సీన్స్ చదివిన ఆమె అనుభవం ముందు వర్మ తెలివి తేటలు ఏమి పని చేయలేదు. ఇక మరోమారు మనీ సినిమా ను నిర్మించడానికి వర్మ రెడీ అయ్యాక ఆ సినిమా గురించి మాట్లాడానికి జయసుధ ఇంటికి వెళ్ళాడట. ఇక ఆ రోజు జయసుధ ఇంటికి వెళ్ళడానికి ముందు బాగా అందంగా కనిపించాలని తనకు ఉన్న బెస్ట్ డ్రెస్ వేసుకొని, తల దువ్వుకొని ఆవిడ ఇంటికి వెళ్లి బెల్ కొట్టాడట. తలుపు తెరుచుకుంది కానీ ఎవరు కనిపించడం లేదు వర్మకు. కాస్త వెనక్కి జరిగి చూస్తే అప్పుడు తెలిసింది ఎదురుగ ఉంది నితిన్ కపూర్ అని, ఇప్పటి దాకా అతడు చూసింది నితిన్ కపూర్ చెస్ట్ అని. అంత పెద్ద నితిన్ కపూర్ ని చూసాక అక్కడితో జయసుధ పై తన లవ్ ముగిసిపోయింది అని వర్మ ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు. నితిన్ కపూర్ ముందు తాను ఒక బచ్చ గాడిని అని వర్మ ఫీల్ అయ్యాడట.