ఇదంతా ఇలా ఉండగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన ఒక వార్త వినిపిస్తోంది.అది కూడా తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రజనీకాంత్ కెరియర్లో 171వ సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి.. డైరెక్టర్ లోకేష్ కనకరాజు ,రజనీకాంత్ త్వరలోనే కలవబోతున్నారని.. త్వరలోనే ఒక బడా నిర్మాతతో సినిమాను నిర్మించబోతున్నట్లుగా కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
సూపర్ సార్ రజనీకాంత్ తో సినిమాలోకి తన యూనివర్సిటీతో కలుపుతాడేమో అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.. ఇలా కలిపితే ఒక భారీ మల్టీ స్టార్ సినిమా కాబోతుందని చెప్పవచ్చు. ఇప్పటికే కమలహాసన్, సూర్య ,కార్తీ, ఫహద్ ఫజిల్, విజయ్ సేతుపతి ఇలా అందరినీ కలుపుకొని తెరకెక్కించారు ఎప్పుడు రజనీకాంత్ తో అంటే ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాని కమలహాసన్ హోమ్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తుంది.. ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటిస్తున్నారు. సరైన సక్సెస్ కోసం రజనీకాంత్ అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.