టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్‌, అల్లు అర్జున్  తొలిసారి బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో ఎన్టీఆర్సినిమా చేస్తోన్నాడు. ఈ పాన్ ఇండియన్ సినిమాను 2024 ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ ‌గా అనౌన్స్‌చేసింది.

మరోవైపు సుకుమార్ దర్శకత్వం లో పుష్ప-2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్‌. ఈ సీక్వెల్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్ 8న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే డేట్ కన్ఫామ్ అయితే మూడు రోజుల వ్యవధి లో ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం అవుతుంది.

ఎన్టీఆర్ సినిమా రిలీజ్‌ను దృష్టి లో పెట్టు కొని పుష్ప -2 వెనక్కి తగ్గుతుందా ? అదే డేట్‌కు కట్టుబడి ఉండి ఎన్టీఆర్ ‌తో ఫస్ట్ టైమ్ బాక్సాఫీస్ ఫైట్‌ కు అల్లు అర్జున్ సిద్ధమవుతాడా? అన్నదాని పై త్వరలో నే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సెట్స్ లో అడుగు పెట్టిన ఎన్టీఆర్.ఆర్ఆర్ఆర్ తర్వాత షూటింగ్ ‌లకు లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ శనివారం నుంచి కొరటాల శివ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. కోస్టల్ ఏరియా బ్యాక్ ‌డ్రాప్‌ లో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందు లో ఎన్టీఆర్‌ కు జోడీ గా జాన్వీ కపూర్ హీరోయిన్ ‌గా నటిస్తోంది.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతోన్న పుష్ప -2 షూటింగ్ హైదరాబాద్‌ లో జుగుతోంది. ఫస్ట్ పార్ట్ సక్సెస్ నేపథ్యం లో పుష్ప ది రూల్ సినిమా పై పాన్ ఇండియా లెవెల్‌ లో భారీ గా అంచనాలు నెలకొన్నాయి. పుష్ప -2లో రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటిస్తోండ గా ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: