టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల నటించిన 'దాస్ కా ధమ్కీ' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సూపర్ హిట్ గా నిలిచింది. విశ్వక్ సేన్ స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మొదటిసారి డ్యూయల్ రోల్ లో నటించాడు. అందులో నెగిటివ్ నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచాడు. ఇక నివేదా థామస్ విశ్వక్ సరసన హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. విశ్వక్సేన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకొని బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక దర్శకుడిగా విశ్వక్ ఈ సినిమాతో మరో హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఇక థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయింది. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ తెలుగు ఓటీపీ ఆహాలో ఏప్రిల్ 14 గురించి దాస్ కా ధమ్కీ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ అప్డేట్ ని స్వయంగా ఆహా అధికారికంగా ప్రకటించింది. వనమయి క్రియేషన్స్, విశ్వక్సేన్ బ్యానర్స్ పై కరాటే రాజు, విశ్వక్సేన్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించారు. మార్చి 22న ఉగాది కానుకగా థియేటర్స్ లో విడుదలైన ఈ మూవీలో ప్రముఖ విలక్షణ నటుడు రావు రమేష్, రోహిణి, హైపర్ ఆది, మహేష్ తదితరులు కీలక పాత్రలు నటించారు. డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే వ్యక్తి సంజయ్ రుద్ర.

అలాగే పుట్టిన తర్వాత అనాధగా మరి చాలా కష్టపడి పెరిగి పెద్దయిన మరో వ్యక్తిగా కృష్ణ దాస్.ఈ ఇద్దరి మధ్య జరిగే పోరాటమే దాస్ కా ధమ్కీ మూవీ.ఇక సినిమాలో విశ్వక్సేన్, హైపర్ ఆది, మహేష్ ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్ వరకు సరదాగా కామెడీ, పాటలతో సాగిపోయే ఈ సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ తో ఊహించని మలుపు తీసుకుంటుంది. ఇక సినిమాలో ఉండే ట్విస్టులు,టర్న్స్ ప్రేక్షకులను చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తాయి. ఇక సినిమా లాస్ట్ లో మరో భారీ ట్విస్ట్ ని కూడా పెట్టారు. అదే దాస్ కా ధమ్కీ సినిమాకి పార్ట్ 2 కూడా ఉండబోతోంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ ని బట్టి పార్ట్ వన్ కంటే పార్ట్ 2 నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే పార్ట్ 2 కొంత గ్యాప్ తర్వాత పట్టాలెక్కనున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: