ఖుషి లాంటి సినిమా చేయడనికి దర్శకుడు ఎస్ జె సూర్య చాలానే కష్టపడ్డాడని చెప్పాలి.. ఈ సినిమా కన్నా ముందు కేవలం వాలి అనే ఒక సినిమా మాత్రమే చేసాడటా సూర్య.
ఆ సినిమా ఘనవిజయం సాధించడం తో నిర్మాత ఏ ఎం రత్నం తన కోసం ఒక సినిమా చేయాలనీ అడగడం తో ఒకే చేసాడటా.అయితే ఈ సినిమా కేవలం తెలుగు మరియు తమిళ్ లో కూడా తీయాలని కూడా అడిగాడు. అంతకు ముందే ఏ ఎం రత్నం దగ్గర తమిళ హీరో విజయ్ డేట్స్ తో పాటు తెలుగు హీరో పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా ఉన్నాయట.. ఈ సినిమా మొదట విజయ్ తో తమిళ్ లో తెరకెక్కించాడని సమాచారం.
జ్యోతిక హీరోయిన్ గా, విజయ్ హీరో గా తెరకెక్కిన తర్వాత సరిగ్గా ఏడాదికి అంటే 2001 లో పవన్ కళ్యాణ్ మరియు భూమిక జంట గా ఎస్ జె సూర్య డైరెక్ట్ చేసాడటా.అయితే తమిళ్లో ఈ చిత్రం విడుదల అయ్యాక పేరుకు సినిమాకు సంబంధం లేదు అంటూ నెగటివ్ టాక్ ని అయితే దక్కించుకుంది. అందుకోసమే తెలుగు లో తీసే సినిమా కోసం ఖుషి కాకుండా మరొక టైటిల్ పెట్టాలని మేకర్స్ నిర్ణయించుకున్నారటా.దాంతో మొదట చెప్పాలని ఉంది అనే పేరును వర్కింగ్ టైటిల్ గా ఫిక్స్ అయ్యారు. షూటింగ్ చాల రోజుల పాటు జరగకుండా లేట్ అవుతూ అవుతూ ఆ తర్వాత ముద్దు అనే పేరును కూడా అనుకున్నారటా.. ఆ తర్వాత కొన్నాళ్ళకు మళ్లి మొదటికే వచ్చి ఖుషి అనే పేరునే ఖరారు చేసారటా.. సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక మైలు రాయి గా అయితే మిగిలిపోయింది. ఇక తమిళ్ ఖుషి కి జ్యోతిక కు ఫిలిం ఫేర్ అవార్డు లభించగా. తెలుగు లో భూమిక కు సైతం ఫిలిం ఫేర్ అవార్డు లభించిందటా. ఇలా ఇద్దరు హీరోయిన్స్ కి మాత్రమే ఈ చిత్రం ద్వారా అవార్డు లభించడం గమనార్హం.