నాని దసరా సినిమా  ప్రభంజనం  మామూలుగా లేదు. ఈ సమయంలో ఎలాంటి వేరే పెద్ద హీరోల చిత్రాలు లేకపోవడంతో ప్రేక్షకులకు ఏకైక ఆప్షన్ దసరా మూవీ అని భావిస్తుండడంతో సినిమాకు కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి.

కానీ ఇది ఏ మాత్రం సరిపోవడం లేదు నాని పాన్ ఇండియా స్టార్ గా ఎదగడానికి వేసుకున్న స్కెచ్ పెద్దగా వర్కౌట్ అయినట్టుగా కనిపించడం లేదని తెలుస్తుంది.. ఈ సినిమాని దేశవ్యాప్తంగా తానే దగ్గర ఉండి హీరోయిన్ కీర్తి సురేష్ తో కలిసి ప్రచారం చేశాడటా. కేరళ, తమిళనాడు అలాగే కర్ణాటక వంటి రాష్ట్రాల్లో గట్టి ప్రమోషన్స్ చేసినప్పటికీ జనాలకు అంత గా రీచ్ కాలేదు. పుష్ప సినిమా  మాదిరిగానే కనిపిస్తున్న ఈ చిత్రాన్ని చూడ్డానికి ఈ జనాలకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పైగా నాని మరియు కీర్తి సురేష్ ఇద్దరూ కూడా సౌత్ ఇండియన్ యాక్టర్స్ కావడంతో వీరికి నార్త్ ఇండియన్ ప్రమోషన్స్ దొరకడం కష్టంగా ఉందని తెలుస్తుంది.

సౌత్ మరియు నార్త్ అనే తేడా లేకుండా సినిమా హిట్ అవ్వాలి అంటే కచ్చితంగా అందులో ఒకరైన పాన్ ఇండియా స్టార్ కనుక ఉంటే బాగుండేది. కానీ నాని లోకల్ ఆర్టిస్టులతో  సినిమా తీయాలని చాలా ట్రై చేశాడు. అందుకే నానీ ప్రస్తుతం మరొక స్కెచ్ తో ఈ చిత్రాన్ని ఎలాగైనా సరే పాన్ ఇండియా చిత్రంగా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మొదట రాజమౌళితో ఈ సినిమా బాగుంది అని చెప్పించాలని ప్రయత్నించాడటా.. ఎందుకంటే ఈగ సినిమా నుంచి రాజమౌళితో నానికి మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. అందుకే ఈ చిత్రం చాలా బాగుంది అంటూ రాజమౌళితో పోస్ట్ కూడా పెట్టించాడు. మరోవైపు మహేష్ బాబు కూడా ఎంతో కొంత బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరో కాబట్టి మహేష్ బాబును కూడా ప్రమోషన్స్ కోసం వాడుకున్నాడటా.ఇక మన తెలుగు నుంచి మొట్టమొదటి ప్లాన్ ఏంటి ఆ స్టార్ అయిన ప్రభాస్ తో సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి రివ్యూ పెట్టించడం అనేది మాములు విషయం కాదు.అసలు ప్రభాస్ సోషల్ మీడియా వాడడు అనే సంగతి అందరికీ తెలుసు. అతని టీం మాత్రమే అతని సోషల్ మీడియా ఖాతాలను హ్యాండిల్ చేస్తూ ఉంటుందటా.అలాంటి ప్రభాస్ సైతం నాని కోసం రంగంలోకి దిగాడని తెలుస్తుంది.. అప్పుడే బాలీవుడ్ , టాలీవుడ్ అనే సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలలో నాని సినిమాకు ప్రమోషన్ అయితే దక్కుతుంది అని భావించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: