టాలీవుడ్ లో హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఏప్రిల్ 8న 1983లో తమిళనాడు మద్రాసులో జన్మించారు అల్లు అర్జున్.. ఈ రోజున అల్లు అర్జున్ 41వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు.. దింతో అభిమానులు అల్లు అర్జున్ గురించి తెలుసుకోవాలని తెగ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. మరి అల్లు అర్జున్ గురించి తెలియని కొన్ని విషయాలను ఒకసారి తెలుసుకుందాం.


అల్లు అర్జున్ తల్లిదండ్రుల పేరు నిర్మల ,అల్లు అరవింద్. 18 ఏళ్ల కెరియర్ లోనే దాదాపుగా 19 సినిమాలలో నటించారు అల్లు అర్జున్.. అల్లు అర్జున్ మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా విజేత ఈ సినిమాలో చైల్డ్ యాక్టర్ గా నటించారు ఆ తర్వాత చిరంజీవి నటించిన డాడీ సినిమాలో ఒక డాన్సర్ గా కనిపించారు. అయితే హీరోగా పరిచయమైంది మాత్రం గంగోత్రి సినిమాలోని ఈ సినిమా సక్సెస్ అందుకోవడంతో ఆ తర్వాత ఆర్య సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్నారు. అల్లు అర్జున్ కు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు.


అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాలలో పాటు కేరళలో కూడా మంచి క్రేజీ ఉంది.. అల్లు అర్జున్ కి ఫోటో షూట్ అంటే చాలా ఇష్టము ఆ తర్వాత డాన్స్ యాక్టింగ్ ఇలాంటి వాటిని ఇష్టపడుతూ ఉంటారు. అల్లు అర్జున్ యానిమేషన్ కోర్సు కూడా పూర్తిగా నేర్చుకున్నట్లు తెలుస్తోంది.. సరైనోడు సినిమా బ్లాక్ బస్టర్ విజయం కావడంతో బాలీవుడ్ లో కూడా డబ్బింగ్ సినిమాతో హిందీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు ఆ తర్వాత విడుదలైన పుష్ప సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్నారు. ఎక్కువగా చిరంజీవి సినిమాలను ఇష్టపడతారు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప -2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్ ఈ చిత్రానికి సంబంధించి  గ్లింప్ కూడా వైరల్ గా మారుతోంది.. ఏది ఏమైనా అల్లు అర్జున్ మొదట నుంచి కష్టపడుతూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: