ఈ క్రమంలోనే అక్కినేని మాజీ కోడలు.. హీరోయిన్ సమంత కూడా తన మరిది అఖిల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.. నాగచైతన్య తో విడిపోయినప్పటికీ అక్కినేని కుటుంబంతో మాత్రం సమంత ఇప్పటికీ మంచి అనుబంధాన్ని కొనసాగిస్తోంది.. తాజాగా హ్యాపీ బర్తడే అఖిల్ అక్కినేని యాయ్ ఏప్రిల్ 28న ఏజెంట్ రిలీజ్ కాబోతోంది.. చూస్తుంటే ఫైర్ లా ఉంది లాట్సాఫ్ లవ్ యు అంటూ రాసుకుంది.. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక పోస్ట్ మాత్రం సమంత తన ఇంస్టాగ్రామ్ నుంచి షేర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో అక్కినేని అభిమానులు కూడా తెగ సంబరపడుతున్నారు.
మరొకవైపు అక్కినేని హీరోలు అఖిల్, సుశాంత్ ల సినిమాలకు సమంత బెస్ట్ విషెస్ అందిస్తూ సోషల్ మీడియా ద్వారా పలు పోస్టులను తెలిపింది. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీలోనూ రానా మీహిక వెంకటేష్ కూతురు అశ్రీతలతో ఆమెకు మంచి అనుబంధం ఉన్నది. ఎలాగైనా స్టార్ స్టేటస్ ను అందుకోవాలని తపన పడుతున్న అఖిల్ కు మరి ఏజెంట్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి మరి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు స్పై అండ్ యాక్షన్ త్రిల్లర్ చిత్రంగా ఈ సినిమాని ఈ సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్టు కాస్త తెగ వైరల్ గా మారుతోంది.