ఇప్పుడు తాజాగా తమిళ్లో విడుదలైన విడుదలై మొదటి భాగం సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. స్టైల్ ఆఫ్ మేకింగ్ తో ఈ చిత్రాన్ని సూరి మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ తో విజయ్ సేతుపతి స్టాండింగ్ యాక్షన్ తో అందరిని ఆకట్టుకున్నారు. తమిళంలో సెకండ్ వీక్ లో ఎంట్రీ అయిన ఈ సినిమా విడుదలై మొదటి భాగాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెలుగులో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 15వ తేదీన తెలుగులో విడుదల చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ని కూడా విడుదల చేశారు.
కమెడియన్ సూరి ఇందులో అద్భుతమైన నటనలను ప్రదర్శించడమే కాకుండా పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించారు అలాగే విజయ్ సేతుపతి కూడా విలన్ గా అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. రియాలిస్టిక్ మేకింగ్ అనే విధంగా ఈ సినిమా కనిపిస్తోంది. దీంతో గీత ఆర్ట్స్ బ్యానర్ అభిమానులు మాత్రం ఈ చిత్రం మరొక కాంతారా అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ట్రైలర్ తో మంచి హైట్ ని సంపాదించుకున్న ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది.