టాలీవుడ్ హీరో మహేష్ బాబుతో సినిమా చేయాలని ఎంతోమంది హీరోయిన్ల సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న 28వ చిత్రానికి సంబంధించి తాజాగా ఒక విషయం వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే శ్రీలీల ఇందులోకి అనుకోకుండా వచ్చిందని శ్రీ లీల కంటే ముందుగా ఈమె పాత్రను ఒక హీరోయిన్ కి చెప్పినట్లుగా తెలుస్తోంది.వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.



నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ద్వారా తెలుగు తెరకు సుపరిచితురాలు అయిన హీరోయిన్ ప్రియాంక అరుణ్ మోహన్ తన అంద చందాలతో అమాయకకు చూపులతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత డాన్, ET, వరుణ్ డాక్టర్, తదితర సినిమాలలో నటించింది. ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది ప్రస్తుతం ఒక చిత్రానికి కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లుగా. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మహేష్ 28వ సినిమా కోసం ఈమెను సంప్రదించగా ఈమె నిరాకరించడంతో ఈ ఆఫర్ను శ్రీ లీల వద్దకు వెళ్ళగా ఆమె ధ్రువీకరించినట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని ప్రియాంకనే తెలియజేసినట్లు తెలుస్తోంది.

అయితే ఇంతటి అవకాశం వచ్చినా కూడా ఈ ముద్దుగుమ్మ ఎందుకు రిజెక్ట్ చేసిందేమో అన్నట్లుగా అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారుతోంది.. మరి కొంతమంది మాత్రం ఇందులో సెకండ్ హీరోయిన్ పాత్ర పెద్దగా ఉండదు కాబట్టి ఈ ముద్దుగుమ్మ రిజెక్ట్ చేసిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక మెయిన్ హీరోయిన్ గా ఇందులో పూజ హెగ్డే కూడా నటిస్తోంది కనుక క్రెడిట్ అంత ఆమెకే వెళ్ళిపోతుందని అందుకే ప్రియాంక అరుణ్ మోహన్ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసిందేమో అన్నట్లుగా ఆమె అభిమానులు భావిస్తున్నారు. మరి ఎమ్మడు రిజెక్ట్ చేయడానికి గల కారణం ఏంటో ఈమె తెలియజేస్తే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: