వకీల్ సాబ్ సినిమా విడుదల సమయంలో ఓవర్సీస్ మార్కెట్లో సిట్టింగ్ కెపాసిటీ కేవలం 30 శాతం మాత్రమే ఉన్నది కర్ణాటక మరియు చెన్నై వంటి ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రేక్షకులు కూడా పెద్దగా ఈ సినిమా చూసే మూడులో లేరు అక్కడి మార్కెట్ సరిగ్గా ఉండి ఉంటే ఈ చిత్రం అప్పట్లో కొన్ని కోట్ల రూపాయలు అందుకునేది అని ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నారు. అయితే ఈ సినిమా రెండు వారాల లోపే థియేటర్స్ అన్ని కూడా లాక్డౌన్ కారణంగా మూసివేయడం జరిగింది.. దీంతో రూ .90 కోట్ల రూపాయల వరకు షేర్ని రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమా విడుదలై నిన్నటితో రెండేళ్లు పూర్తి చేసుకోండి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ట్విట్టర్లో గ్రాండ్గా ఒక స్పేస్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ కూడా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి వకీల్ సాబ్-2 స్క్రిప్ట్ మీద పనిచేస్తున్నానని త్వరలోనే ఈ సినిమాకి వెళ్లబోతోంది అంటూ తెలియజేయడం జరిగింది. ఇదే కనుక జరిగితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా రికార్డు సృష్టించడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. సంబంధించిన పూర్తి వివరాలు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వెలుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.