యంగ్ సెన్సేషన్ శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ హీరోలతో పాటు యువ హీరోల సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ తెగ బిజీగా మారిపోయింది. టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చి ఇంకా రెండేళ్లు పూర్తి కాకముందే చేతినిండా సినిమాలతో స్టార్ హీరోయిన్స్ సైతం గడగడలాడిస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మన బుట్ట బొమ్మ పూజా హెగ్డే కు పెద్ద తలనొప్పిగా మారిందట. ఇప్పటికే పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న 'SSMB 28'లో మరో హీరోయిన్గా సెలెక్ట్ అయింది శ్రీ లీల. ఈ సినిమాలో పూజా హెగ్డే కంటే శ్రీలీల పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు.

 ఈ విషయం కాస్త పక్కన పెడితే.. తాజాగా పూజ హెగ్డే కు రావాల్సిన ఓ మూవీ ఆఫర్ ని శ్రీ లీల లాగేసుకుందట. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. అయితే ఈ మూవీలో పవన్ కి హీరోయిన్ గా ముందు పూజ హెగ్డేని అనుకున్నారట. కానీ ప్రస్తుతం టాలీవుడ్ అంతా శ్రీలీల జపం చేస్తుండడంతో పూజా హెగ్డే ను కాదని చిత్ర యూనిట్ పవన్ కి జోడిగా శ్రీ లీలను ఎంపీగా చేశారట. ఇక ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా శ్రీ లీల కూడా ఈ షూటింగ్లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.

ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ తో శ్రీ లీల స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. అయితే తాజాగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పవన్ ఫ్యాన్స్ సైతం పవన్ పక్కన శ్రీ లీల సూపర్ కాంబినేషన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే మూవీ మేకర్స్ ఈ విషయాన్ని ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తూ ఉండగా.. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. ఇక వీలైనంత తక్కువ సమయంలో మూవీ షూటింగ్ని పూర్తి చేసి సినిమాని విడుదల చేయాలని మేకర్ సన్నాహాలు చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: