టాలీవుడ్ పాన్ ఇండియా హీరోస్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల కలయికలో ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కబోతున్నట్లు ఫిలిం సర్కిల్స్లో క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఇక వీరిద్దరి కాంబో మల్టీస్టారర్ మూవీని కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్ట్ చేయబోతున్నారట. తమిళంలో వడ చెన్నై, అసురన్ వంటి కల్ట్ మూవీస్ తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు వెట్రి మారన్. తాజాగా తమిళంలో 'విడుదలై' అనే మూవీతో మరో హిట్ ని అందుకున్నాడు. అయితే అసురన్ సినిమా కంటే ముందే ఎన్టీఆర్, అల్లు అర్జున్ కి కథ చెప్పాడట ఈ దర్శకుడు. ఇక ఈ కథ కూడా ఇద్దరు హీరోలకు చాలా బాగా నచ్చిందట.

కానీ అప్పుడు తారక్, బన్నీ తమ బిజీ షెడ్యూల్స్ వల్ల ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అయితే త్వరలోనే ఈ మల్టీస్టారర్ సెట్స్ పైకి కి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే వెట్రి మారన్ ఫుల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈమధ్యనే  ఫుల్ స్క్రిప్ట్ ను ఎన్టీఆర్ బన్నీలకు వినిపించడంతో దాదాపుగా ఈ ప్రాజెక్టు ఖాయమైనట్లు చెబుతున్నారు. ఇక ఈ ప్రాజెక్టు భారీ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందట. 2024 ఆరంభంలో ఈ మల్టీ స్టారర్ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ మల్టీ స్టారర్లో అల్లు అర్జున్, ఎన్టీఆర్ ప్రత్యర్థులుగా కనిపిస్తారట. నిజానికి బన్నీ తారక్ ఇద్దరికీ భారీ మాస్ ఇమేజ్ ఉంది.

అయితే ఈ మాస్ ఇమేజ్ ని పక్కన పెట్టి ఎన్టీఆర్ బన్నీ లను సరికొత్తగా ప్రజెంట్ చేయాలని వెట్రి మారన్ అనుకుంటున్నాడట. కాగా వెట్రిమోరన్ ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ యాక్షన్ సినిమాలే. తన సినిమాలో యాక్షన్ లో పాటు ఒక స్ట్రాంగ్ పాయింట్ కూడా ఉంటుంది. మరి ఇప్పుడు బన్నీ, తారక్ లతో వెట్రిమారన్ ఏ రేంజ్ యాక్షన్ మూవీ తీస్తాడో చూడాలి. ఇక ఇప్పటికే తమిళ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లిస్టులో ముందు వరుసలో ఉన్నాడు దర్శకుడు వెట్రి మారన్. ఇలాంటి టాప్ డైరెక్టర్ తో బన్నీ, తారక్ మల్టీ స్టారర్ మూవీ అంటే కచ్చితంగా బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అంటున్నారు అభిమానులు. ఇక ప్రస్తుతం ఈ వార్తతో అటు బన్నీ ఇటు తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాదు ఇప్పటినుంచే ఫ్యాన్స్ ఈ మల్టీ స్టారర్ పై భారీగా అంచనాలను పెంచేసుకుంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: