టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. 'NTR 30' అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఇక ఈ సినిమా లాంచింగ్ డే రోజే సినిమాలో మృగాల వేట ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పాడు కొరటాల శివ. అప్పటినుంచి ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే మూవీ అప్డేట్స్ కోసం ఫాన్స్ అయితే ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. అయితే మే 20 న జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే ఉంది. 

ఆ రోజు ఎన్టీఆర్ 30 నుంచి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ఈలోపే ఎన్టీఆర్ 30 కి లీకులు స్టార్ట్ అయిపోయాయి. తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించి ఆన్ లొకేషన్ పిక్స్ కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో లీకై తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ లీకైన పిక్స్ లో ఎన్టీఆర్ కలర్ ఫుల్ డ్రెస్ తో పాటు అదిరిపోయే ఫిజిక్ అవుట్ ఫిట్ తో కనిపిస్తున్నాడు. ఈ షూటింగ్ పిక్స్ ని చూస్తుంటే ఏదో రెస్టారెంట్లో ఊరు నుంచి వచ్చిన పెద్దలతో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ పిక్ ఎలా లీక్ అయిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ పిక్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. 

ఇలా ఆన్ లొకేషన్ లో పిక్స్ లీక్ అవ్వడం పై జూనియర్ ఎన్టీఆర్ చిత్ర యూనిట్ పై చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అటు కొరటాల శివ కూడా ఈ లీక్స్ పై ఫైర్ అవుతున్నాడట. ఎవరు ఈ పిక్స్ ని లీక్ చేశారని ఆరా తీసే పనిలో ప్రస్తుతం చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ లీక్ చేసిన వాళ్లని వదిలిపెట్టే సమస్య లేదని అంటున్నారట. ఇక ముందు ముందు మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా మూవీ టీం చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అటు ఫాన్స్ కూడా మూవీ యూనిట్ కి మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుతున్నారు. అయితే లీకైన పిక్ లో ఎన్టీఆర్ లుక్ చూస్తుంటే ఈసారి కొరటాల శివ ఎన్టీఆర్ తో ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా 2024 వేసవి కానుకగా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: