సినీ సెలబ్రిటీలకు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో గాసిప్స్ వైరల్ అవుతూ ఉంటాయి. కొంతమంది అభిమానులు వాటిని కొట్టి పారేస్తారు. మరి కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తారు. అయితే ఈమధ్య మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జంటకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు పది సంవత్సరాల తర్వాత చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ఉపాసనకు దుబాయ్ లో గ్రాండ్ గా సీమంతం కూడా జరిగింది. అందుకు సంబంధించిన పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ గా మారాయి. 

అయితే తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ జంటకు సంబంధించి మరో రూమర్ తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఉపాసనకు బిడ్డ పుడితే జరిగేది ఇదే అంటూ ఓ న్యూస్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ఉపాసన జాతకం ప్రకారం ఆమెకి కొడుకు పుడితే ఆమె జీవితం బాగుంటుందని.. ఒకవేళ ఆడపిల్ల పుడితే ఉపాసన విమర్శల పాలయ్యే అవకాశం ఉందని న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు కొడుకు పుడితేనే మెగా ఫ్యామిలీకి ఇప్పుడున్న దాని కంటే ఎక్కువ పరువు ప్రతిష్టలు రెట్టింపు అవుతాయని ఉపాసన జాతకంలో ఉందట. అయితే ఈ వార్తలను విన్న అభిమానులు ఇవన్నీ తప్పుడు వార్తలని.. కొంతమంది కావాలని ఇలాంటి పుకార్లను ప్రచారం చేస్తున్నారని మెగా ఫాన్స్ ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు.

ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ అంతా రామ్ చరణ్ కి వారసుడు పుట్టాలని కోరుకుంటున్నారు. ఇక ఇటీవల దుబాయ్ వెకేషన్ వెళ్లిన రామ్ చరణ్ ఉపాసన అక్కడ ఎంతగానో ఎంజాయ్ చేశారు  వెకేషన్ కు సంబంధించిన పిక్స్ సైతం సోషల్ మీడియాలో అయ్యాయి. ఇక తాజాగా దుబాయ్ వెకేషన్ ముగించుకొని హైదరాబాద్ వచ్చేసారు ఈ జంట. రామ్ చరణ్ మరో వారం రోజుల్లో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడు ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకు ముస్తాబవుతోంది. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్లో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: