బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ తాజాగా నిన్నటి రోజున షూటింగ్ సెట్లో గాయాల పాలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా నటిస్తున్న చిత్రం కేడి.. ఈ సినిమా లో సంజయ్ దత్ విలన్ పాత్ర లో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో భారీగా పేలుడు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అన్ని రకాల భద్రత చర్యలు తీసుకున్నప్పటికీ ఈ పేలుడు కారణంగా సంజయ్ దత్ చేతులు, ముఖం, భుజం మీద గాయాలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే సంజయ్ దత్ ని  హుటాహుటిగా అక్కడే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించడం జరిగిందట .ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సంజయ్ దత్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అభిమానులు మాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలియజేసినట్లు సమాచారం.. గతంలో కూడా సంజయ్ దత్ క్యాన్సర్ బారిన పడి కోల్పోవడం జరిగింది. క్యాన్సర్ సమయంలో సుదీర్ఘ కాలం పాటు అమెరికాలో చికిత్స తీసుకున్నారు సంజయ్ దత్.


కేడి సినిమాకు ప్రేమ్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ప్రేమ్ ఎవరో కాదు రవితేజ నటించిన ఇడియట్ సినిమాలో హీరోయిన్ రక్షిత్ భర్త.. ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పుడు టీజర్ కూడా విడుదల చేశారు. ఫుల్ యాక్షన్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ చిత్రం కేజిఎఫ్ తో సంజయ్ దత్ అక్కడ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. దక్షిణాదిలోనే పాపులారిటీ సంపాదించుకున్న సంజయ్ దత్ కేజిఎఫ్ చిత్రంలో అధీరా పాత్రలో అద్భుతమైన నటనలు ప్రదర్శించారు. ఈయన నటన చూసి చాలామంది మంత్రము ముద్దులయ్యారు. ఈ సినిమా తర్వాత కన్నడ నుంచి సంజయ్ దత్ కు పలు  అవకాశాలు వెలుబడుతూనే ఉన్నాయి. అభిమానులు మాత్రం ఈయన త్వరగా కోలుకోవాలని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: