శాకుంతలం : గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో దేవ్ మోహన్ హీరో గా నటించగా ... సమంత ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని రేపు అనగా ఏప్రిల్ 14 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు/ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీ 2 గంటల 22 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
రుద్రుడు : రాఘవ లారెన్స్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా ... కతిరేశన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. తమిళంలో రుద్రన్ అనే పేరుతో రూపొందిన ఈ మూవీ ని తెలుగు లో రుద్రుడు పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు/ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 29 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదల : కమెడియన్ సూరి హీరోగా విజయ్ సేతుపతి కీలకపాత్రల రూపొందిన ఈ మూవీ కి వెట్రీ మారన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుతలై పార్ట్ 1 అనే పేరుతో తమిళంలో ఇప్పటికే విడుదల అయి మంచి విజయం అందుకుంది. ఈ మూవీ ని "విడుదల" పేరుతో ఏప్రిల్ 15 వ తేదీన తెలుగు లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ లభించగా ... 2 గంటల 30 నిమిషాలు నిడివి తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.