రాజకీయాలలో సినిమాలలో చిన్నచిన్న భేదాభిప్రాయాలు ఏర్పడినప్పటికీ ఆ భేదాభిప్రాయాలను పెరగకుండా రాజకీయనాయకులు సెలెబ్రెటీలు చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వీలైనంత వరకు ఆ గ్యాప్ ను బయటపెట్టకుండా ఎవరి స్థాయిలో వారు నటిస్తూ ఉంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ లు కూడ అదే తీరును ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నట్లు ఒక విషయం తెలియచేస్తోంది అన్న కామెంట్స్ వస్తున్నాయి.


‘అరవింద సమేత’ తరువాత జూనియర్ 30వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించవలసి ఉంది. దీనికి సంబంధించిన అధికారక ప్రకటన కూడ వచ్చింది అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయి త్రివిక్రమ్ మహేష్ వైపు జూనియర్ కొరటాల శివ వైపు వెళ్ళడం జరిగి ఆ కాంబినేషన్ లో తమతమ సినిమాలను కొనసాగిస్తున్నారు.


లేటెస్ట్ గా జూనియర్ తన అత్యంత విలాసవంతమైన ఫామ్ హౌస్ లో అమెజాన్ ఇంటర్నేషనల్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫేరిల్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా అతడిని జూనియర్ తన ఫామ్ హౌస్ కు ఆహ్వానించి అతడి గౌరవార్థం ఒక భారీ డిన్నర్ పార్టీని ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పార్టీకి రాజమౌళి కొరటాల శివ లతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడ హాజరు కావడానికి సంబంధించిన ఫోటోలు షోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.


దీనితో త్రివిక్రమ్ కు జూనియర్ కు మధ్య గ్యాప్ ఏర్పడింది అంటు సోషల్ మీడియాలో హడావిడి చేసిన వార్తలు అన్నీ గాసిప్పులు మాత్రమే అన్నవిషయం తేలిపోయింది. ప్రస్తుతం జూనియర్ కొరటాలతో మూవీని పూర్తి చేసిన తరువాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయవలసి ఉంది. త్రివిక్రమ్ మహేష్ తో సినిమాను పూర్తి చేసిన తరువాత మరొక హీరోతో సినిమా చేయవలసి ఉంది. ఆమధ్య బన్నీ తో త్రివిక్రమ్ సినిమా చేస్తాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ ఫోటోను బట్టి త్రివిక్రమ్ జూనియర్మూవీ వచ్చే సంవత్సరం ఉండవచ్చు అన్న సంకేతాలు వస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: