పలు అంతర్జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు రాజమౌళి ప్రఖ్యాత మ్యాగజైన్ టైమ్స్ అత్యంత ప్రభావితమైన ప్రముఖుల లిస్టులో టైమ్స్ మ్యాగజైన్ ది మోస్ట్ ఇన్ఫీలియన్స్ పీపుల్ ఆఫ్ 2023 లో రాజమౌళికి స్థానం దక్కడంతో ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న ఏకైక ఇండియన్ ఫిలిం మేకర్ గా రికార్డును అందుకున్నారు రాజమౌళి. ఈ విషయం తెలిసిన రాజమౌళి అభిమానులు సినీ సెలబ్రిటీల సైతం రాజమౌళికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
RRR చిత్రంలో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిసి బ్రిటీష్ వారి పైన పోరాడితే ఎలా ఉంటుంది అని ఊహాగాన కల్పితంతో సినిమాని తెరకెక్కించి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు రాజమౌళి. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతమైన నటనను కనబరిచారు. దీంతో రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఇతర దర్శక నిర్మాతలు నటీనటులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టును మహేష్ బాబు తో చిత్రీకరించబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలు కాబోతోంది .ప్రస్తుతం ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా రూ .2000 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళికి సంబంధించి ఈ ట్విట్ వైరల్ గా మారుతోంది.