టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా శాకుంతలం.నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చూసిన వాళ్లు  అనుకున్నంత రేంజ్ లో లేదని చెప్పుకుంటున్నారు.అసలు శాకుంతల పాత్రలో సమంత అంతగా సూట్ కాలేదు అన్న సమాచారం వినిపిస్తుంది. శాకుంతలం పాత్రలో అనుష్క లాంటి హీరోయిన్ ఉంటే సినిమా ఇంకో రేంజిలో ఉండేదని చెప్పుకుంటున్నారు. సమంత మంచి నటే కానీ శాకుంతలం లాంటి పాత్రలో ఆమె సూట్ కాలేదు అని అంటున్నారు.ముఖ్యంగా సమంత తో పాటుగా సినిమాలో గ్రాఫిక్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయని సమాచారం తెలుస్తుంది. ఇంకా అంతేకాదు యుద్ధ సన్నివేశాలు కూడా  ఏం బాగాలేవని అంటున్నారు. గుణశేఖర్ మంచి ప్రతిభ గల దర్శకుడే కానీ శాకుంతలం విషయంలో మాత్రం అతని మ్యాజిక్ పనిచేయలేదని సమాచారం తెలుస్తుంది.ఇంకా అలాగే కాస్టింగ్ తో పాటుగా సినిమా టేకింగ్ లో చాలా లోపాలు ఉన్నట్టు తెలుస్తుంది.


సినిమాను తాము అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేయాలనే ఆలోచనతో ఇలా చేసి ఉండొచ్చని సినిమా చూస్తే అర్ధం అవుతుంది.అసలు శాకుంతలం అనగానే ఆడియన్స్ లో ఒక రేంజ్ లో అంచనాలు ఉంటాయి కానీ ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేదని చెబుతున్నారు. సినిమాకు ఇంకాస్త బడ్జెట్ ఇంకా సరైన కాస్టింగ్ పడి ఉంటే సినిమా కొంచెం బెటర్ గా వచ్చి ఉండేది. సమంత ఇలాంటి ప్రయోగం చేయడం మంచి విషయమే కానీ ఎలాంటి ఉపయోగం లేదు. సినిమాలో తను పెట్టిన ఎఫర్ట్ కనిపిస్తున్నాయి కానీ ఎందుకో ఆడియన్స్ కి మాత్రం కనెక్ట్ అవడంలో విఫలమైంది.దసరా సినిమా సందడి దాదాపు ముగిసినట్టే..అలాగే మరో వారం దాకా ఏ సినిమా పోటీగా లేదు. శాకుంతలం సినిమాకు చక్కటి సోలో రిలీజ్ దొరికింది. అలాగే స్టూడెంట్స్ కి కూడా హాలిడేస్ ఇచ్చారు. ఈ టైం లో శాకుంతలం అదరగొట్టేస్తుంది అనుకున్నారు. కానీ ఈ సినిమా ఒక మంచి ఛాన్స్ ని మిస్ చేసుకున్నట్టు అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: