ప్రస్తుతం మన ఇండియాలో ఐపీఎల్ హంగామా ఇంత జోరుగా కొనసాగుతుందో తెలిసిందే. ఇక క్రికెట్ లవర్స్ తమ ఫేవరెట్ టీమ్స్ కి సపోర్ట్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సీజన్లో అన్ని జట్ల కంటే ఎక్కువ పాయింట్స్ తో రాజస్థాన్ రాయల్స్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత స్థానంలో లక్నో జట్టు ఉంది. అయితే నిన్న రాత్రి హైదరాబాద్ కోల్కతా నడుమ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే కదా. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు సోషల్ మీడియాలో ఇరుజట్లకు ఉండే అడ్మిన్స్ తమ తమ టీం ను సపోర్ట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా పలు పోస్టులు పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ తో మ్యాచ్ ఉన్న నేపథ్యంలో కేకేఆర్ జట్టు అడ్మిన్ ఓ పోస్ట్ పెట్టాడు. 

ఇందులో ఓ బిర్యాని పిక్ కూడా పెట్టాడు. ఇక పిక్ పెట్టిన తర్వాత ఇలా రాసుకొచ్చాడు. SRH అడ్మిన్ బిర్యానీలపై మన ప్రేమను పంచుకుందాం. ఈరోజు అద్భుతమైన మ్యాచ్ ఎంజాయ్ చేద్దాం. మీకు సినిమాలో అల్లు అర్జున్ అంటే ఎంత ఇష్టమో.. మాకు బిర్యానీలో ఆలు అంటే అంత ఇష్టం అంటూ రాస్కొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ చూసిన బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఒక పాన్ ఇండియా స్టార్ ను పట్టుకొని ఆలుతో పోలుస్తారా? అంటూ బన్నీ ఫ్యాన్స్ కేకేఆర్ అడ్మిన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఇండియన్ స్టార్ హీరోను ఒక ప్రాంతానికి పరిమితం చేయొద్దు అంటూ ఈ సందర్భంగా ఫ్యాన్స్ కోరుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ టాపిక్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. 

ఇక నిన్న రాత్రి జరిగిన కేకేఆర్ ఎస్ ఆర్ హెచ్ మ్యాచ్ లో హైదరాబాద్ టీం ఘన విజయం సాధించింది. కేకేఆర్ జట్టు పై 23 పరుగుల తేడాతో విజయం అందుకుంది.ముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది కేకేఆర్ టీం. ఇక ఫస్ట్ బ్యాటింగ్ కి దిగిన హైదరాబాద్ టీం 20 ఓర్లలో ఏకంగా 227 పరుగులు చేశారు. హ్యారీ బ్రూక్ కేవలం 55 బంతుల్లోనూ 100 పరుగులు సాధించి ఐపీఎల్ 2023లో తన మొదటి సెంచరీని నమోదు చేసుకున్నాడు. అలాగే ఆడమ్ మార్కరమ్ 26 బంతుల్లో 50 పరుగులు సాధించగా, మరో ప్లేయర్ అభిషేక్ శర్మ 17 బంతుల్లో 32 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: