మీ అందరితో ఎలాగైనా మాట్లాడాలనుకున్నాను మీ ప్రేమను పొందే క్రమంలో ఎన్నో ఆటంకాలు వచ్చిన తట్టుకొని నిలబడ్డాను.. తల్లితండ్రులకు గురువులను గర్వపడేలా చేయాలంటూ ఫ్యాన్స్ కి తెలియజేశారు.. తన జీవితంలో బైక్ యాక్సిడెంట్ ఊహించలేదు మీ అందరిని టెన్షన్ లో పెట్టినందుకు క్షమించండి ఆ సమయంలో అమ్మ, తమ్ముడితో మాట్లాడేందుకు కూడా మాటలు రాలేదని తెలిపారు. తనకు జరిగిన ప్రమాదం మరెవరికి జరగకూడదు అని స్టేజ్ మీద హెల్మెట్ చూపిస్తూ అందరూ హెల్మెట్ ధరించాలని తెలియజేశారు.
యాక్సిడెంట్ తర్వాత సాయి ధరంతేజ్ మాట తీరులో మార్పు వచ్చిందని ఈ విషయాన్ని అందరూ ఎగతాళిగా మాట్లాడుతున్నారు.. కానీ ఆ బాధని తలుచుకుంటే తనకి భయం వేస్తుందని తెలిపారు. బాధ ప్రతి ఒక్క మనిషిని మారుస్తుందని.. తెలిపారు. సుకుమారు కూడా స్టేజ్ మీద మాట్లాడుతూ గతంలో చాలా చలాకీగా జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఉండే సాయి ధరంతేజ్ ఇలా మాట్లాడడం ఇదే మొదటిసారి అంటూ తెలిపారు. ఇక విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ కూడా లైఫ్ని రిస్క్ లో ఉన్న ఈ సినిమా చేసి పోదాం అనుకున్నాడు కానీ మెడిసిన్ తో తన వ్యాధి తగ్గింది సినిమాను కూడా చాలా గొప్పగా తీశామని తెలిపారు. సుకుమారు కూడా ఈ చిత్రంలో భాగస్వామ్యం.