ఈవారం విడుదల కాబోతున్న ‘విరూపాక్ష’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఉద్వేగభరితంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడిన తీరు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే ఈ మెగా మేనల్లుడి మాటలలో ఉద్వేగం బాధ చూసిన వారు తేజ్ తన యాక్సిడెంట్ షాక్ నుండి తేరుకోలేద అని అనిపించడమే కాకుండా అతడిలో తాత్వికత బాగా పెరిగిందా అన్న సందేహాలు వస్తున్నాయి. అమ్మా – నాన్న - గురువులు గర్వించేలా ఎదగాలని తేజ్ పిలుపు ఇచ్చాడు.


ఇదే సందర్భంలో అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా తేజ్ ఇచ్చిన సందేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రేమించే అమ్మాయిలో తప్ప మిగతా అందర్లో అమ్మను చూడాలి అంటూ అతడు సందేశం ఇవ్వడమే కాకుండా ఒక మంచి సమాజాన్ని క్రియేట్ చేయమని పిలుపు ఇచ్చాడు. ఇక అమ్మాయిల గురించి మాట్లాడుతూ అబ్బాయిలు అప్పుడప్పుడు తప్పు చేయడం సహజమని వాళ్లను క్షమించాలని కోరుతున్నాడు.


సాధారణంగా యంగ్ హీరోలు తమ సినిమాల ఫంక్షన్స్ లో ఇలా మాట్లాడరు. తమ సినిమా గురించి ఎక్కువ గొప్పలు చెపుతూ ఆ సినిమా పై అంచనాలు పెంచడానికి తాము చేయతగ్గ అన్ని ప్రయత్నాలు చేస్తారు. అయితే సాయి ధరమ్ తేజ్ ఈవిషయంలో భిన్నంగా వ్యవహరిస్తూ తమ మూవీని డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది.  


ఈ శుక్రు వారం విడుదల కాబోతున్న ఈ మూవీ తేజ్ కెరియర్ కు ఎంతో కీలకమైంది. యాక్సిడెంట్ తరువాత తేరుకుని నటిస్తున్న ఈమూవీ సక్సస్ ను బట్టి సాయి ధరమ్ తేజ్ మార్కెట్ ఆధారపడి ఉంటుంది. ఈమూవీ విడుదల తరువాత సమ్మర్ రేస్ చివరిలో విడుదల అయ్యే ‘వినోదయా సితం’ రీమెక్ పై ఈ మెగా మేనల్లుడు చాల ఆశలు పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న మూవీ కావడంతో పవన్ అభిమానులకు మరింత చేరువ అవ్వచ్చని తేజ్ నమ్మకం..



మరింత సమాచారం తెలుసుకోండి: