ముఖ్యంగా ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ని అయితే ఏర్పరుచుకున్నాడు. హీరో వెంకటేష్ ఎక్కువ శాతం చేసిన సినిమాలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు. అందుకే ఇప్పటికి వెంకటేష్ సినిమా విడుదల అవుతుంది అంటే మగవారికి అంటే ఎక్కువగా లేడీ ఫ్యాన్స్ థియేటర్ దగ్గర కనిపిస్తూ ఉంటారట.
ముఖ్యంగా చెప్పాలి అంటే వెంకటేష్ కి ఉన్నంత ఫ్యామిలీ హీరో ఇమేజ్ మరి హీరోకి లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. 30 ఏళ్లుగా బాగా కష్టపడి మంచి గుర్తింపును సంపాదించుకున్న వెంకటేష్ ఒకే ఒక్క వెబ్ సిరీస్ తో ఆ గుర్తింపు చల్లా చెదురు చేసుకున్నాడు. వెంకటేష్ కి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ అంతా కూడా బాగా డ్యామేజ్ అయింది. రానా నాయుడు వెబ్ సిరీస్ లో హీరో వెంకటేష్ రానా బోల్డ్ నెస్ చూసి తెలుగు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. ఈ వెబ్ సిరీస్ విడుదలైన తర్వాత దాదాపుగా పది రోజులు వరకు అందులోని బూతు సన్నివేశాల గురించి మాట్లాడుకున్నారంటే ఈ సిరీస్ ఏ రేంజ్ లో విమర్శల పాలయ్యిందో అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా మొదట్లో అయితే బ్లూ ఫిలిం లానే ఉందనే విమర్శలు కూడా విపరీతంగా వినిపించాయి. ఈ వెబ్ సిరీస్ విడుదల తర్వాత రానా పై అలాగే హీరో వెంకటేష్ పై దారుణంగా ట్రోలింగ్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా రానా నాయుడు 2 అనౌన్స్ ని చేసిందట.మొదటి సీజన్ ఏ చూడడానికి ఇష్టపడడం లేదు అంటే ఇప్పుడు రెండవ సీజన్ కమింగ్ సూన్ అంటూ నెట్ ఫ్లిక్స్ ఒక పోస్ట్ చేయడంతో వీడియోని కూడా విడుదల చేసింది. ఒకవేళ ఈ సిరీస్ ను విడుదల చేయాలి అనుకుంటే అడల్ట్ కంటెంట్ తగ్గించాలని పలువురు కామెంట్స్ కూడా చేస్తున్నారు. కొంతమంది వెంకటేష్ రాణాలకు పరువు పోయిన ఇంకా మారలేదా.. ఇంకా ఎందుకు ఆ ప్రాజెక్ట్ ని పట్టుకుని వేలాడుతున్నారు ఆ సిరీస్ మీకు అవసరమా అంటూ కామెంట్ కూడా చేస్తున్నారు.