నటి రంభ గురించి ఇప్పటి ప్రేక్షకులకు అంతగా తెలియక పోయినప్పటికీ అప్పటి ప్రేక్షకులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది.రంభ.

తెలుగులో అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బావగారు బాగున్నారా, భైరవద్వీపం,అరుణాచలం, బొంబాయి ప్రియుడు, ముద్దుల ప్రియుడు,మాతో పెట్టుకోకు అలాగే రౌడీ అన్నయ్య లాంటి ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించింది రంభ.

అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ మరియు వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అప్పట్లో అందం అభినయంతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసింది. ఇప్పటికీ కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తోంది హీరోయిన్ రంభ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రంభ ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేసింది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ..ఇప్పటి హీరోయిన్లలో నాకు హీరోయిన్ త్రిషఅంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆమెతో రెండు మూడు సార్లు కలిసినప్పుడు మాట్లాడాను చాలా బాగా అయితే మాట్లాడుతుంది. చాలామంది హీరోయిన్లు తెలిసినా కూడా చూసి చూడనట్టుగా అయితే వ్యవహరిస్తుంటారు అని చెప్పుకొచ్చింది రంభ. ఇప్పటి హీరోలలో ఎవరితో నటిస్తారు అని యాంకర్ అడగగా మహేష్ బాబు, ప్రభాస్ తో ఇప్పటివరకు సినిమాలు అయితే చేయలేదు. ఒకవేళ అవకాశం వస్తే ఆలోచిస్తాను అని చెప్పుకొచ్చిందట రంభ. అనంతరం తాను చేసిన ఐటెం సాంగ్స్ గురించి మాట్లాడుతూ నాచోరే నాచోరే సాంగ్ అంటే నాకు ఎంతో ఇష్టం అందులో జూనియర్ ఎన్టీఆర్ కష్టపడినప్పటికీ క్రెడిట్ అంతా కూడా నేనే కొట్టేశాను అని నవ్వుతూ తెలిపింది రంభ. మీతో డాన్స్ చేసిన వారిలో బెస్ట్ డాన్సర్ ఎవరు అని ప్రశ్నించగా.. ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్ అనగా వెంటనే యాంకర్ మరి ప్రభుదేవా అని అనడంతో కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా మాస్టర్ వెరీ గుడ్ అని కూడా తెలిపింది. బట్ ఒక డాన్సర్ గా మాత్రం  సినిమాలలో అలా  చూస్తూ ఉండాలి అనుకున్న డాన్సులలో ఎన్టీఆర్ ఇస్ ద బెస్ట్ అంటూ ఎన్టీఆర్ ఈజ్ మై బెస్ట్ డాన్సర్ అని కూడా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: