కానీ ఊహించని రీతిలో భారీ అంచనాల మధ్య వచ్చిన శాకంతులం సినిమా అట్టర్ ప్లాప్ గా నిలిచింది అని చెప్పాలి. దాదాపు థియేటర్లు అన్నింటిలో కూడా ఈ సినిమాను తీసేశారు. ఇక ఈ సినిమాలో నటించిన సమంతను విపరీతంగా ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు అని చెప్పాలి. అయితే సమంత నటించిన శాకుంతలం సినిమా ఫ్లాప్ కావడానికి అటు జూనియర్ ఎన్టీఆర్ కారణం అంటూ ఒక వార్తా ప్రస్తుతం తెరమీదకి వచ్చింది. అదేంటి సమంత నటించిన శాకుంతలం సినిమాకు జూనియర్ ఎన్టీఆర్కు సంబంధం ఏంటి అనుకుంటున్నారు కదా..
ఈ సినిమాలో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హత నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం ముందుగా జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకుని తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఎన్టీఆర్ తన కొడుకుని అప్పుడే ఇండస్ట్రీలోకి దింపడం ఇష్టం లేక ఇక ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. దీంతో సమంత ఫ్యాన్స్ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడానికి ఎన్టీఆర్ కారణం అంటూ ఒక వార్తను తిరమీదికి తీసుకువచ్చారు. ఎందుకంటే ఎన్టీఆర్ తన కొడుకుని ఈ సినిమాలో నటింప చేసేందుకు ఒప్పుకొని ఉంటే సినిమా షూటింగ్ ఎంతో తొందరగా పూర్తి అయ్యేదని.. ఎప్పుడో రిలీజ్ అయ్యే ఉండేదని.. అలా జరగలేదు కాబట్టి ఇప్పుడు టఫ్ కాంపిటీషన్ సినిమాల మధ్య రిలీజ్ కావడంతో శాకుంతలం అట్టర్ ఫ్లాప్ అయిందని అందుకే దీనికి కారణం పరోక్షంగా ఎన్టీఆర్ అని అంటున్నారు సమంతా ఫ్యాన్స్.