టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులను ఒకరు అయినటు వంటి సురేందర్ రెడ్డి తాజాగా ఏజెంట్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అక్కినేని అఖిల్ హీరో గా నటించిన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మించగా ... మమ్ముట్టి ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని ఈ నెల 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. 

సినిమా విడుదల తేదీ దగ్గరపడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరుస ఇంటర్వ్యూ లలో ... వరుస టీవీ షో లలో పాల్గొంటూ ఈ సినిమాను అదిరిపోయే రేంజ్ లో ప్రమోట్ చేస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ ఏప్రిల్ 23 వ తేదీన వరంగల్లో భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేయబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా ఈ చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో భారీ యాక్షన్ సన్నివేశాలు చాలా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ లోని యాక్షన్స్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను కట్టి పడేసే విధంగా అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: