
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ... చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మెహర్ రమేష్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. సందీప్ రెడ్డి వంగా ... రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా యానిమల్ అనే మూవీ ని రూపొందిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని కూడా ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. తమిళ హీరో శివ కార్తికేయన్ ప్రస్తుతం అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న మా వీరన్ అనే తమిళ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని తెలుగు లో మహా వీరుడు పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మూవీ.ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే ఈ మూవీ ని కూడా ఆగస్టు 11 వ తేదీన విడుదల చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి కొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలబడబోతున్నట్లు తెలుస్తోంది.