తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచు గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జోష్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ యువ హీరో ఆ తర్వాత అనేక మూవీ లలో హీరో గా నటించి మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించు కున్నాడు. నాగ చైతన్య ఇటు లవ్ ... అటు యాక్షన్ మూవీ లలో మరియు ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ లలో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించు కున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నాగ చైతన్య "కస్టడీ" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. 

వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీ కి ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ... ప్రియమణి ... అరవింద స్వామి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ లో కృతి శెట్టి ... నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని మే 12 వ తేదీన థియేటర్ లలో తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం ఒక పాటను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "టైమ్ లెస్ లవ్" అంటూ సాగే రెండవ పాటను విడుదల చేసింది. మరి ఈ రెండవ పాటకు ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తెలుగు మరియు తమిళ సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: