కరోనా మహమ్మారి  తరువాత ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అన్ని సినిమాలు కాకపోయినా పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను మంచి లాభాలను అందిస్తుండటం విశేషం.

ఈ ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై కొన్ని సినిమాలు నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను  అయితే అందించాయి. ఆ జాబితాలో బలగం, విరూపాక్ష  సినిమాలు ముందువరసలో ఉన్నాయి.

ఈ రెండు సినిమాలు నిర్మాతల కు  కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు కాకి ఫార్ములాతో హిట్ అయ్యాయని కామెంట్లు కూడా వ్యక్తమవుతూ ఉండటం విశేషం.బలగం సినిమాలో కాకి ప్రధానంగా కథ నడవగా విరూపాక్షలో కొన్ని సన్నివేశాల్లో కాకి ముఖ్య పాత్ర పోషించింది. రాబోయే రోజుల్లో సినిమాలలో కాకి ఫార్ములాకు ప్రాధాన్యత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని తెలుస్తుంది.ఈ సినిమాల దర్శకులకు కూడా ఈ సినిమాలు మంచి పేరు ను తెచ్చిపెట్టాయి. బలగం సినిమా సక్సెస్ తో కమెడియన్ వేణుకు మంచి ఆఫర్లు వస్తుండగా విరూపాక్ష డైరెక్టర్ కార్మీక్ వర్మ దండుకు ఈ సినిమా సెకండ్ మూవీ కావడం విశేషం.సుకుమార్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే వల్లే ఈ సినిమా రేంజ్ మారిందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. విరూపాక్ష మూవీ రెండో రోజు కూడా భారీ స్థాయిలో కలెక్షన్లను అయితే సాధించింది. సాయిధరమ్ తేజ్ ఇప్పటివరకు నటించిన సినిమాలతో పోల్చి చూస్తే విరూపాక్ష బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విరూపాక్ష మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందిస్తుండటం విశేషం.విరూపాక్ష ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయల రేంజ్ లో లాభాలను అందించే అవకాశం ఉంది. ఇతర భాషల్లో కూడా ఈ సినిమా విజయం సాధిస్తుందని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: