రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మైథాలజికల్ చిత్రం ఆది పురుష్. ఈ చిత్రం రామాయణ కథ ఆధారంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు . సీత పాత్రలో కృతి సనన్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో ఎన్నో రకాలుగా ట్రోలింగ్కి గురి కావడంతో ఈ సినిమా కాస్త విడుదల తేదీ వాయిదా వేయడం జరిగింది అలా మళ్లీ 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి VFX వర్క్ మెరుగుపరచుకొని జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.


విడుదల దగ్గర పడుతూ ఉన్న సమయంలో చిత్ర బృందం ఇటీవలే ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేస్తోంది. ఈ చిత్రానికి ఇటీవలే ఒక అరుదైన గౌరవం కూడా దక్కించుకుంది. జూన్ 7వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు న్యూయార్క్ లో జరగబోయే ట్రిబేక ఫెస్టివల్  లో ఆది పురుష్ ప్రీమియర్ వేయబోతున్నట్లు సమాచారం.. జూన్ 13న ఆది పురుష్ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నట్లు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. అయితే ఈ ఫెస్టివల్ లో ఈ సినిమాకి వస్తున్న క్రేజీ చూస్తుంటే మామూలుగా లేదని తెలుస్తోంది.ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ కూడా మంచి డిమాండ్ పెరుగుతూ ఉండడంతో ఒక షోని కాస్త మూడు షోలు వేయడం జరుగుతోందట.

విచిత్రాన్ని జూన్ 13 14 15 తేదీలలో ప్రీమియర్ సోలుగా వేయబోతున్నారు. ఇక ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ లో ప్రభాస్ సినిమాకి వస్తున్న క్రేజీ చూసి అభిమానులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ విషయంలో కాస్త నెగిటివిటీ సంపాదించుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో ఇలాంటి ఆదరణ వస్తూ ఉండడంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడుతోందని చెప్పవచ్చు. ఈ సినిమా ట్రైలర్ ని మే మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: