టాలీవుడ్ లో అనతి కాలంలోనే టాప్ ప్రొడక్షన్ హౌస్ గా పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ పేరు గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. ఈ ఏడాది ఆరంభంలోనే రెండు పెద్ద సినిమాలు రిలీజ్ చేసి భారీ విజయాలు సాధించారు మైత్రి నిర్మాతలు. తర్వాత కూడా బడాబడా ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తూ వార్తల్లో నిలిచారు. అలా అనౌన్స్ చేసిన సినిమాలన్నీ కూడా ఇప్పుడు చకచకా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇలాంటి సమయంలోనే మైత్రి మూవీ మేకర్స్ మరో విషయంలో ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. అదే ఐటీ రైట్స్. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ రైట్స్ కొత్త కాకపోయినా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ మీద జరుగుతున్న సోదాలు మాత్రం చాలా పెద్ద విషయం అంటున్నారు. 

ఏప్రిల్ 19 నుండి మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లపై అలాగే వారి సన్నిహితుల కార్యాలయాలపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. అయితే వీటికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు రాలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఐటీ అధికారులు మైత్రి సంస్థలోకి 700 కోట్ల విదేశీ పెట్టబడులు వచ్చినట్లుగా గుర్తించారట. ఆ డబ్బు ఎలా వచ్చింది? అది ఎందుకు జరిగిందనే విషయంలో విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఇక డబ్బుల విషయానికొస్తే.. విదేశాల నుంచి వచ్చిన ఈ డబ్బు తొలుత ముంబైకి చెందిన ఓ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్లుగా ఐటి అధికారులు గుర్తించారట. అలా వచ్చిన మొత్తం డబ్బును ఏకంగా ఏడు కంపెనీలకు బదిలీ చేశారని అంటున్నారు.

అంతేకాదు ఓ బాలీవుడ్ ప్రాజెక్టు కోసం అక్కడి అగ్ర దర్శకుడికి హవాలా ద్వారా 150 కోట్లు కూడా అందజేశారట మైత్రి నిర్మాతలు. ప్రస్తుతం మైత్రి వాళ్లపై జరుగుతున్న ఈ దాడులకు ఆ లావాదేవీలే కారణమని చెబుతున్నారు. అక్కడ తీగ లాగితే డొంక మొత్తం కదిలిందని సమాచారం. గతంలోనూ మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులపై ఐటి రైడ్ జరిగాయి. కానీ ఈసారి పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై ఇంత జరుగుతున్న ఆ నిర్మాతలు మాత్రం చాలా కూల్ గా 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎడిటింగ్ కి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: