తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో రూపొందిన ఈ నగరానికి ఏమైంది మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ యువ హీరో ఆ తరువాత ఫలక్ నామ దాస్ అనే పక్కా మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటుడి గా ... మంచి దర్శకుడుగా గుర్తింపును సంపాదించుకున్నాడు.

 ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో దాస్ కా దమ్కి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి కూడా విశ్వక్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి పార్ట్ 2 ను కూడా తెరకెక్కించబోతున్నట్లు ఈ యువ నటుడు మరియు దర్శకుడు  ప్రకటించాడు.

 ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న ఈ యువ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరు అయినటు వంటి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక మూవీ చేయబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే లైగర్ మూవీ ఫ్లాప్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న పూరి జగన్నాథ్ తన తదుపరి మూవీ ని రామ్ పోతినేని తో చేయబోతున్నాడు. ఆ తరువాత పూరి జగన్నాథ్ ... విశ్వక్ కాంబినేషన్ లో సినిమా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: