ఆయన నిర్మించిన లేదంటే ఆయన విడుదల చేసిన సినిమాల్లో మ్యాటర్ ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం వందల కోట్ల బడ్జెట్ తో రాంచరణ్ హీరో గా శంకర్ దర్శకత్వం లో గేమ్ ఛేంజర్ అనే సినిమా ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా నిర్మాణం పూర్తి కాకుండానే ఇంకా పలు భారీ బడ్జెట్ చిత్రాలను కూడా లైన్ లో పెట్టబోతున్నాడు. ప్రస్తుతానికి దిల్ రాజు నిర్మాత గా అందరి కంటే బిజీగా ఉన్నాడు. ఈ సమయం లో నిర్మాణ బాధ్యతలను తన కూతురు మరియు సోదరుడు కొడుకు కి అప్పగించాలని భావించిన విషయం తెల్సిందే. ఇటీవల బలగం చిత్రాన్ని దిల్ రాజు తర్వాతి తరం వారే నిర్మించడం జరిగింది. బలగం సినిమా కు దిల్ రాజు కేవలం మాత్రమే వ్యవహరించాడు.
భారీ అంచనాల నడుమ రూపొందిన చిత్రాలు మాత్రమే కాకుండా కొత్త దర్శకులతో కొత్త నటీనటులతో కూడా దిల్ రాజు కాంపౌండ్ నుండి సినిమాలు నిర్మించాలని భావిస్తున్నారు. బలగం వంటి సినిమాలు ఇక పై సంవత్సరానికి 10 వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఐదు కోట్ల లోపు బడ్జెట్ తో వరుసగా సినిమాలను నిర్మించి అందులో మూడు నాలుగు సక్సెస్ అయినా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని దిల్ రాజు కాంపౌండ్ వారు భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సంవత్సరంలోనే మరో నాలుగు ఐదు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారట. కథలు విని ఓకే చెప్పడం వరకు తన పని అని..నిర్మాణ వ్యవహారాలంతా కూడా తన కూతురు మరియు సోదరుడి కుమారుడు చూసుకుంటారని సన్నిహితుల వద్ద దిల్ రాజు పేర్కొన్నాడట. దిల్ రాజ్ కి ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ సినిమా ల విడుదల సమయం లో హడావుడి చేసి మంచి టాక్ సొంతం చేసుకుని కలెక్షన్స్ దక్కించుకునే అవకాశాలుంటాయి. ఒక వైపు వందల కోట్ల బడ్జెట్ సినిమాలు మరో వైపు లో బడ్జెట్ చిత్రాలతో దిల్ రాజు పేరు మరింతగా మారు మ్రోగే అవకాశాలు ఉన్నాయి.