ఇంకొంత మంది వయసు పెరుగుతున్న కొద్దీ మరింత యంగ్ గా కనిపించడానికి ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగు లోకి వస్తున్నాయి. అయితే ఇలా ప్లాస్టిక్ సర్జరీలు చేసుకున్న ఎంతో మంది సెలబ్రిటీలు ఈ విషయాన్ని అటు సోషల్ మీడియా వేదికగా స్వయం గా వెల్లడించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ప్లాస్టిక్ సర్జరీల ద్వారా ఎంతో మంది ఇలా మరింత అందంగా తయారవుతూ ఉంటే మరి కొంత మంది మాత్రం అందం కోసం ప్లాస్టిక్ సర్జరీల జోలికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ మరో సెలబ్రిటీ ప్రాణం తీసింది. అమెరికన్ స్టార్ అయిన కిమ్ కర్దాషియాన్ లాగా కనిపించేందుకు సర్జరీ చేయించుకుని ఒక మోడల్ చివరికి గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయింది. న్యూయార్కుకు చెందిన క్రిష్టిన హస్తిన్ గౌర్కానీ అనే 34 ఏళ్ళ మోడల్ అప్పటికే పలు సర్జరీలు చేయించుకున్నారు. అమెరికన్ స్టార్ లాగా కనిపించేందుకు మరోసారి సర్జరీ చేయించుకోగా.. అది వికటించి గుండె పని తీరుపై ప్రభావం చూపించింది. దీంతో గుండెపోటు వచ్చి చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఇలా ప్లాస్టిక్ సర్జరీ వికటించి ప్రాణాలు కోల్పోతున్న సెలబ్రిటీల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.