టాలీవుడ్లో లీడింగ్ విలన్ గా పేరు పొందిన నటుడు రాహుల్ దేవ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అతడు, సినిమాలో సింహాద్రి సినిమాలో విలన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక రాహుల్ దేవ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో విలన్ గా నటించి బాగానే ఆకట్టుకున్నారు. తెలుగులో కూడా ఆకాశ వీధుల్లో అనే సినిమాతో మొదటిసారిగా అడుగుపెట్టారు. ఆ తర్వాత టక్కరి దొంగ సినిమాతో మెయిన్ విలన్ గా పేరుపొందడంతో ఆ తర్వాత తన సినీ కెరియర్ ఒకసారిగా మలుపు తిరిగింది.


ఒకప్పుడు విలన్ గా పేరుపొందిన రాహుల్ దేవ్ ఆ బ్రాండ్ ని పూర్తిగా చెరిపేసి స్టైలిష్ మేకోవర్తో కండలు తిరిగిన శరీరంతో హీరోలకు దీటుగా వెండితెర పైన కనిపించాలని పలు ప్రయత్నాలు చేస్తున్నారు రాహుల్ దేవ్. రాహుల్ దేవ్ విలన్ గా బ్రాండ్ క్రియేట్ చేయడమే కాకుండా ఏకంగా తొమ్మిది భాషలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ఎక్కువగా తెలుగు హిందీ వంటి భాషలలో రాహుల్ దేవ్ విలన్ గా నటించి మెప్పించారు. ఇక అప్పుడప్పుడు సాఫ్ట్ క్యారెక్టర్లలో కూడా కనిపిస్తూ తన నటనతో ఆకట్టుకున్నారు.


ఈ ఏడాది ఓటీటి లో విడుదలైన గ్యాస్ లైట్ అనే సినిమాతో బాగా పేరు సంపాదించారు .వయసులో కూడా తిరిగిన శరీరంతో ఫిట్నెస్ చూసి పలువురి నెటిజెన్లు చాలామందికి రోల్ మోడల్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ లుక్ పరంగా చాలామందికి మార్పు వస్తూ ఉంటుంది కానీ ఈ స్టైలిష్ వీలనుకు మాత్రం ఎలాంటి మార్పు రాలేదు ఫర్ఫెక్ట్ గా తన ఫిజిక్కిని మెయింటైన్ చేస్తూ ఉన్నారు తాజాగా ట్విట్టర్లు ఒక స్టైలిష్ మీకు ఫోటోలు షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: