తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించిన మహనీయుడుగా.. తెలుగు వాడి గొప్ప తనాన్ని వెలుగొందెల చేసినా నటసార్వభౌముడిగా గొప్ప దర్శకుడిగా అంతకు మించి రాజకీయ నాయకుడిగా ప్రజల మనసు తెలుసుకున్న ముఖ్య మంత్రిగా ఇలా చెప్పుకుంటూ పోతే నందమూరి తారక రామారావు యుగపురుషుడి లాగానే జీవితాన్ని సాగించారు అని చెప్పాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ లో నందమూరి తారక రామారావును కొట్టే హీరో మరొకరు లేరు అనేంతగా విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించారు.


 అయితే సినిమాల్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయం లోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి రాజకీయాల్లో కూడా తనకు తిరుగులేదు అని నిరూపించారు నందమూరి తారక రామారావు. తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి అప్పటికి దశాబ్దాల  నుంచి పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే సమయానికి ఆయన పారితోషకం దాదాపు పది లక్షల రూపాయలట   ఈ విషయాన్ని ఇటీవల రజనీకాంత్ వెల్లడించారు. అప్పట్లో 10 లక్షలు అంటే దాదాపు 100 కోట్ల రూపాయలకు సమానం అని చెప్పవచ్చు.



 ఇంత భారీ రేంజ్ రెమ్యూనరేషన్ వదులుకొని... ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు అని చెప్పాలి. తెలుగు వారి ఆత్మగౌరవం పేరుతో ఎన్టీఆర్ రాష్ట్రమంతా తిరిగారని.. రజనీకాంత్ చెప్పుకోచ్చారు. ఆయన ఒక యుగ పురుషుడు అని.. పార్టీ ప్రారంభించిన తొమ్మిది నెలల్లోని రాజకీయాల్లో సంచలనం సృష్టించాడని రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో దుర్యోధనుని పాత్రలో ఎన్టీఆర్ ను చూసిన తర్వాత మెస్మరైస్ అయిపోయాను అంటూ చెప్పుకొచ్చాడు రజినీకాంత్. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా మారిన తర్వాత కూడా తన సంక్షేమ పథకాలతో తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: