కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. రజనీకాంత్ అయితే ఇటీవల ఈనెల 28వ తేదీన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. నందమూరి కుటుంబ సభ్యులు. అయితే ఇందుకు చీఫ్ గెస్ట్ గా రజినీకాంత్ ని పిలవడం జరిగింది. దీంతో రజినీకాంత్ ఎన్టీఆర్ మీద ప్రేమతో ఈ వేడుకకు హాజరు అవ్వడం జరిగింది. అయితే ఈ వేడుకపై రజనీకాంత్ మాట్లాడిన మాటలపై కొంతమంది నాయకులు, సైతం విమర్శలు చేయడం జరిగింది.


ఇప్పుడు తాజాగా నందమూరి లక్ష్మీపార్వతి స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి అన్న సంగతి తెలిసిందే రజనీకాంత్ మరొకసారి ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదంటూ కూడా తెలియజేయడం జరిగింది.. ఆనాడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తుంటే అండగా నిలిచిన వారిలో రజనీకాంత్ కూడా ఒకరని లక్ష్మీపార్వతి తెలియజేస్తోంది. ఆ తర్వాత ఎన్టీఆర్ను కలిసినప్పుడు తప్పు చేశాను సారీ చెప్పారని గుర్తుకు చేయడం జరిగింది. వెన్నుపోటు వ్యవహారంలో రజనీకాంత్ ను తమిళ మీడియా విమర్శించిందని కూడా తెలియజేయడం జరిగింది లక్ష్మీపార్వతి.


చాలా రోజులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరంగా ఉన్న రజనీకాంత్ సడన్గా చంద్రబాబు నాయుడు తెలుగు ఉపయోగించి రజనీకాంత్ ను వాడుకోవాలని చూస్తున్నారని తెలుపుతోంది లక్ష్మీపార్వతి.ముఖ్యంగా రజనీకాంత్ ద్వారా బిజెపి నేతలకు దగ్గర అవ్వాలని చంద్రబాబు ప్లాన్ వేస్తున్నారని లక్ష్మీపార్వతి ఆరోపిస్తోంది వచ్చే ఎన్నికలకు సంబంధించి సర్వేలన్నీ కూడా జగన్కు అనుకూలంగా ఉండడంతో చంద్రబాబు సినిమా వాళ్ళతో నాటకాలు ఆడిస్తున్నారు అంటూ కూడా విమర్శించడం జరిగింది. చంద్రబాబుతో రజనీకాంత్ కూడా వెన్నుపోటు దారుడుగా మారిపోయారని లక్ష్మీపార్వతి ఆరోపిస్తోంది అతని నిజాయితీగా ఉంటే ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఏం మాట్లాడారు తెలుసుకోవాలని కోరడం జరిగింది.. ఎన్టీఆర్ గురించి మాట్లాడేందుకు చంద్రబాబు రజినీకాంత్ ఎవరంటూ కూడా ఆమె ఫైర్ అవుతోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: