అక్కినేని వారసుడు అఖిల్ ఇప్పటివరకు చేసింది తక్కువ సినిమాలేనా అందులో అన్నీ కూడా భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. నటుడిగా ఆయనకు పేరు తీసుకొచ్చిన సినిమాలు కొన్ని అని చెప్పాలి.. ముఖ్యంగా ఆయన క్యారెక్టర్ కోసం శారీరకంగా కష్టపడినవి కూడా ఉన్నాయి.అందులో తాజా చిత్రం ఏజెంట్ .. ఈ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాల పాటు పూర్తిస్థాయిలో శ్రమించి అఖిల్ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాలను అందివ్వలేదు.

ఏజెంట్ కోసం ఆయన పడిన కష్టం మొత్తం వృధా అయిపోయింది.. ఈ నేపథ్యంలోనే ఆయన తన తదుపరి సినిమాను ఎవరితో తీస్తున్నారు అనే ప్రశ్న మొదలైంది.. ఇక దానికి సమాధానం తాజాగా లభించినట్లు తెలుస్తోంది. తాజాగా అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ కొట్టినా సరే యువి క్రియేషన్స్ సంస్థ ఒక సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్ కుమార్ దర్శకుడిగా పని చేయబోతున్నారట.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగులో జరుగుతోందని సమాచారం. ఇకపోతే యువి క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అందరికీ తెలిసిందే.  అందుకే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో అఖిల్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది . ప్రస్తుతం జాన్వి కపూర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె రామ్ చరణ్ , బుచ్చిబాబు సన దర్శకత్వంలో వస్తున్న సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఇప్పుడు అఖిల్ సరసన నటించబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా అఖిల్ అక్కినేని కి ఏజెంట్ సినిమా కలిసి రాకపోయినా దశ మాత్రం తిరిగింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: